![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-9లో.. మాణిక్యం దగ్గరకి రామలక్ష్మి వచ్చి.. అసలు మీకు గతంలో జరిగిందేంటి? మీరు ఇలా అవడానికి కారణమేంటని అడుగుతుంది. నాకు సంబంధించిన బాధలో నేను ఒక్కడినే ఉండాలి. ఎవరికి చెప్పనని మాణిక్యం అంటాడు. ఆ తర్వాత మాణిక్యం గురించి రామలక్ష్మి బాధపడుతుంది.
మరుసటి రోజు ఉదయం సిరికి సీతాకాంత్ కాఫీ తీసుకొని వస్తాడు. సిరి కోపంగా బయటకు వెళ్తుంది. ఆ తర్వాత శ్రీవల్లి కార్ పై ఉన్న కలర్ చూసి ఇంకా ఇది వాష్ చెయ్యలేదా అంటూ కోపంగా డ్రైవర్ ని పిలుస్తుంది.. ఇది క్లీన్ చెయ్యకూడదు. ఇది పోసిన అమ్మాయే వచ్చి క్లీన్ చెయ్యాలి అనగానే... ఇదంతా ఏంటి? అసలేం చాధస్తాలో అని శ్రీవల్లి అంటు ఉంటుంది. అదంతా పై నుండి సీతాకాంత్ విని గట్టిగా అరుస్తాడు. దాంతో శ్రీవల్లి భయపడి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సిరి దగ్గరికి వాళ్ళ అమ్మ వస్తుంది. ఏంటి కాలేజీకి వెళ్లట్లేదా అని అడుగుతుంది. లేదు మానేశా అంటు సిరి కోపంగా వెళ్తుంటే సీతాకాంత్ ఎదరుపడి.. నువ్వు ఇక కాలేజీకి వెళ్ళు.. నీ ప్రాబ్లమ్ సెక్యూరిటీ కదా ఇక వాళ్ళు రారు ఫ్రీగా ఉండని సీతాకాంత్ చెప్పగానే.. సరే అని సిరి హ్యాపీగా ఫీల్ అవుతుంది. కాలేజీకి ఒక్కతే వెళ్తుందేంటి కాలేజీలో మాణిక్యం కన్పించాడని అన్నావ్. ఇప్పుడు సిరిని ఒంటరిగా పంపిస్తున్నావని సీతాకాంత్ ని వాళ్ళ అమ్మ అడుగుతుంది. నేను ఎప్పుడు తనతో ఉంటానని సీతాకాంత్ అంటాడు.
ఆ తర్వాత మాణిక్యం దగ్గరకి అతని భార్య వచ్చి.. రాత్రి అమ్మాయితో ఏం చెప్పావ్ అని అడుగగా.. ఏం లేదని మాణిక్యం అంటాడు. అప్పుడే వచ్చిన రామలక్ష్మి దగ్గర డబ్బులు అడిగి మందు తాగడానికి మాణిక్యం వెళ్తుంటాడు. రాత్రి మీ నాన్న ఏం చెప్పాడు. అతని మాటలు నమ్మకని వాళ్ళ అమ్మ చెప్తుంది. లేదు నాన్న చెప్పేదాంట్లో నిజం ఉంది. నాన్న చెప్పే వరకు వెయిట్ చేస్తానని రామలక్ష్మి అంటుంది.. మరొక వైపు సిరి క్లాస్ లో ఉంటుంది.. సీతాకాంత్ ఆఫీస్ లో చెయ్యాలిసిన వర్క్ కాలేజీ ముందు కూర్చొని చేస్తూ ఉంటాడు. సీతాకాంత్ అలా వర్క్ చేయడం చూసిన కాలేజీ యాజమాన్యం సిరి దగ్గరికి వచ్చి.. ఇదేంటి సిరి అని అడుగుతారు. అంటే సెక్యూరిటీ వద్దని చెప్పాను.. అందుకే ఇలా అని సిరి అనగానే.. మీ అన్నయ్య చాలా గ్రేట్ పెద్ద బిజినెస్ మ్యాన్ అయి ఉండి.. నీకోసం ఇలా చేస్తున్నాడు. నువ్వు చాలా లక్కీ అని అందరు చెప్తుంటే.. సిరికి హ్యాపీగా అనిపిస్తుంది. దాంతో సీతాకాంత్ దగ్గరికి వెళ్లి సారీ అన్నయ్య నువ్వు చెప్పినట్టు వింటానని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |